వైఎస్‌ఆర్‌సీపీ నేతలను పోలీసులకు అప్పగిచిన గ్రామస్తులు

చిత్తూరు జిల్లా : నేడు చిత్తూరు జిల్లా చంద్రగిరి వియోజకవర్గం మొరవపల్లెలో పలువురు వైఎస్‌ఆర్‌సీపీనేతలను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే, వైసీపీ నేతల నుంచి ఓటరు లిస్ట్, ఫామ్ 6, 7 పత్రాలను గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, తమ ఓట్లను తొలగించేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.