అక్టోబర్ 10న వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభo

AP CM YS JAGAN-
AP CM YS JAGAN-

Amaravati: ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవమైన అక్టోబర్ 10న వై యస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… రాష్ట్రంలోని 5.50 కోట్ల మంది ప్రజలకు నేత్ర సమస్యలపై వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబరు వరకు కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.. పాఠశాలల విద్యార్థులకు అక్టోబరు 10 నుండి 16 వరకు ప్రాథమిక పరీక్షలు చేస్తారని, నేత్ర సమస్యలు ఉన్నవారికి రెండవ దశ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స చేస్తారన్నారు. విద్యార్థుల తరువాత సాధారణ ప్రజానీకానికి వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 19 నుండి 25 వరకు పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలుంటాయన్నారు. డిసెంబరు 31 నాటికి విద్యార్థులకు పూర్తి చేయాలన్నారు. ప్రతీ దశ 6 నెలల్లో పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితరులను భాగస్వామ్యం చేయాలన్నారు. 2021 నాటికి 6 దశల్లో ప్రజలందరికీ నేత్ర పరీక్షలు, చికిత్సలు పూర్తి చేయాలన్నారు.