వైఎస్‌ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి

YS Vivekananda
YS Vivekananda

కడప: దివంగత సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు, జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. అయితే పులివెందులలోని నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున వివేకానంద రెడ్డికి గుండెపోటు రావడంతో..తుదిశ్వాస విడిచారు. వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వివేకానంద రెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి 1999, 2004 లో రెండుసార్లు ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి 1989, 1994 లో ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొంది..ప్రజలకు సేవలందించారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండలి సభ్యుడిగా పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/