నేడు సిట్ బృందంతో జగన్‌ భేటి

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసు విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులకు జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. హత్య కేసును త్వరగా తేల్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కడపలో మకాం వేశారు. కేసు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందంతో ఈరోజు ఆయన భేటీ కానున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/