వైఎస్‌ వివేకనందరెడ్డిని హత్య చేశారు?

YS Vivekananda
YS Vivekananda

పులివెందుల: వైఎస్‌ వివేకానందరెడ్డి ఈరోజ ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే తన మృతిపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా వైయస్ వివేకానందరెడ్డిని హత్య చేసి చంపారని పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్టు సమాచారం. కాసేపటి క్రితం వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం పులివెందులలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. వివేకా నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రజానేతను కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వివేకా మృతి దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/andhra-pradesh/