విశాఖకు తొలిసారి ఏపి సియం జగన్‌

స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకోనున్న జగన్‌

YS jagan
YS jagan

విశాఖ: ఏపి సియంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటనకు వెళ్లారు. ఆయనకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్‌ ప్రత్యేక కాన్వా§్‌ులో శారదా పీఠానికి బయలుదేరారు. శారదా పీఠంలో స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుని, కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు చేయించుకోనున్నారు. జగన్‌ వెంట పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైఎస్‌ఆర్‌సిపి నేతలున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/