కడపకు చేరుకున్న జగన్‌

YS jagan
YS jagan

అమరావతి: వైఎస్‌ జగన్‌ కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, ఎస్పి, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో దర్గాను సందర్శించి అనంతరం పులివెందలుకు వెళ్లనున్నారు. అక్కడ సిఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనల్లో జగన్‌ పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయకు బయలుదేరి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి తిరిగి సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/