మీ అంచనాలకు తగ్గట్టు పనిచేస్తాను

ap cm jagan
ap cm jagan

అమరావతి: ఏపి సిఎంగా జగన్‌ నిన్న ప్రమాణస్వీకారం చేసిన విషయం తేలిసిందే. అయితే ఈ సందర్భంగా సిఎం జగన్‌ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం, ప్రమాణస్వీకారం పై ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించిన జగన్‌ ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని, సుపరిపాలన అందిస్తానని హామి ఇచ్చారు. నాపనై పెద్ద బాధ్యత పెట్టారు. మీ అంచనాలకు తగ్గట్టు పనిచేస్తాను. నాకు అపూర్వ విజయం అందించిన ప్రతి ఒక్కరికీ, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంతేకాక ఈ దేశం గర్వంగా ఏపి వైపు చూసేలా సుపరిపాలన అందిస్తాను అని జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/