తాడేపల్లిలో రాజన్న బడిబాట

YS jagan
YS jagan, ap cm

జనవరి 26న ప్రతి తల్లికి రూ.15వేలు ఇస్తాం
పాఠశాలలను అభివృద్ది చేసి చూపుతాం
ఏపి సియం జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సియం జగన్‌, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, హోం మంత్రి మేకతోట సుచరిత తదితరులు పాల్గొన్నారు. సియం చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సియం మాట్లాడుతూ..పిల్లల తల్లిదండ్రులందరూ తమ పిల్లలను బాధ్యతగా బడికి పంపాలని, వారిని ప్రోత్సహించేందుకు బడికి పంపే తల్లులకు జనవరి 26న రూ. 15 వేలు సాయం అందిస్తామని సియం హామీ ఇచ్చారు. తన సుదీర్ఘ పాదయాత్రలో పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూశానని, అందుకే అప్పుడే వారికి మాటిచ్చానని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని అందుకు సంతోషంగా ఉందని అన్నారు. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా పండుగ దినం నిర్వహించి ఆ రోజు ప్రతి తల్లి చేతిలో రూ. 15 వేలు పెడతామని, ఇకపై ఏ తల్లి పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.

కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామని, దాదాపు 40 వేల పాఠశాలల ఫోటోలు తీయిస్తాం, సరిగ్గా రెండేళ్ల తర్వాత అభివృద్ది ఎలా జరిగిందో మళ్లీ ఫోటో తీసి చూపిస్తాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామని, దాంతో పాటు తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని సియం స్పష్టం చేశారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/