అన్ని రంగాల రాబడి తగ్గిపోయింది

Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వెనిజులా మోడల్‌ తీసుకొచ్చిందన్నారు. గవర్నమెంట్‌ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారని ఆరోపించారు. అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకూ ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్‌ చేయడానికే బుగ్గన తాపత్రయం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్‌ ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి తగ్గిపోయిందని వివరించారు. కేంద్రం పేరుతో రవాణా రంగంలో భారీ జరిమానాలు విధిస్తున్నారని విమర్శించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/