ఇవాళ్టి నుంచి వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు

Ananthapur: ఇవాళ్టి నుంచి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అనంతపురంలో ఉదయం 11.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. కంటివెలుగు కార్యక్రమంలో నవంబర్‌ 1, డిసెంబర్‌ నెలాఖరు మధ్య సమగ్ర పరీ క్షలు నిర్వహించనున్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు, కళ్లజోళ్లు, ఇతర వైద్యసాయం అందించనున్నారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికీ కంటివెలుగు పరీక్షలు నిర్వహించనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/