సెక్రటేరియట్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

y s jagan mohan reddy
y s jagan mohan reddy

అమరావతి: సెక్రటేరియట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. శనివారం ఉదయం సచివాలయంలో మొదటి అడుగుపెట్టిన వైఎస్ జగన్.. గ్రీవెన్‌ హాల్‌లో ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. రేపటి కేబినెట్‌ భేటీలో ఐఆర్, సీపీఎస్ రద్దు విషయమై నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలతో సన్నిహితంగా పనిచేసిన వాళ్లను తాను తప్పుబట్టనన్నారు. సచివాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామన్నారు. జగన్ ప్రకటనతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.