మరో ఐదుగురికి కీలక బాధ్యతలు

Y S jagan
Y S jagan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరో ఐదుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌లుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారథి, కొరుముట్ల శ్రీనివాస్‌లను జగన్ నియమించారు. కాగా.. వీరిలో దాదాపు అందరూ మంత్రి పదవి ఆశించినవారే. సామాజిక వర్గం పరంగా లెక్కలేసిన వైఎస్ జగన్ ఈ ఐదుగురికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. దీంతో విప్‌లుగా ఈ ఐదుగురు కీలకనేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే ఈ ఐదుగురు కూడా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు._