సత్తెనపల్లిలో కోడెలతో కలిసి పనిచేస్తాం

TDP
TDP


గుంటూరు: సత్తెనపల్లి టిడిపిలో కొన్ని రోజులుగా అసమ్మతి చెలరేగింది. ఎట్టకేలకు సీటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. భేదాభిప్రాయాలు వీడి కోడెల శివప్రసాద్‌తో కలిసి పనిచేస్తామని స్థానిక టిడిపి నేతలు ప్రకటించడంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. టిడిపి కార్యాలయంలో అసమ్మతి నాయకులతో పార్టీ నేతలు సమావేశమై వారి అభ్యంతరాలను తెలసుకుని వారితో చర్చించారు. అసమ్మతి నేతలతో సమావేశం ముగిసిన తర్వాత కోడెలను 15 వేల మెజార్టీతో గెలిపిస్తామని వారు హామీ ఇచ్చారు.