మంత్రిని హెచ్చరించిన మహిళా రైతు అదృశ్యం

ఆందోళనలో పద్మ కుటుంబ సభ్యులు

Kodali Nani
Kodali Nani

గుంటూరు: ఏపి మంత్రి కొడాలి నానికి హెచ్చరికలు చేసిన మహిళా రైతు యలమంచిలి పద్మ అదీశ్యమైంది. గత నెల యర్రబాలెంలో రైతులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో స్థానిక రైతులతో కలిసి ఆమె పాల్గొంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానిపై ఆమె తీవ్ర హెచ్చరికలు చేసింది. ఆ సమయంలో మహిళా రైతు పద్మ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి పద్మ కనిపించటం లేదని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/