పోలింగ్‌పై జగన్‌ ఎందుకు పెదవి విప్పలేదు?

sabbam hari
sabbam hari


విశాఖపట్టణం: ఏపిలో జరిగిన ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియపై టిడిపి నేత సబ్బంహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే అంతా సవ్యంగా జరిగిందంటూ వైఎస్‌ఆర్‌సిపి నేతలు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. విశాఖలో సబ్బం హరి మీడియాతో మాట్లాడుతూ..పోలింగ్‌ సమయంలో జరిగిన అవకతవకల గురించి వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ ఇంత వరకు పెదవి విప్పకపోవటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 2 లేదా 3 ఈవిఎంలు పని చేయకపోతే జగన్‌ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ప్రజలు టిడిపికి బ్రహ్మరథం పట్టారని, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఇప్పుడు టిడిపికి పది సీట్లు పెరిగే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వైఎస్‌ఆర్‌సిపికి 20 సీట్లు తగ్గే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/