ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి

చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు

botsa satyanarayana
botsa satyanarayana

తిరుపతి: కుప్పానికి తాగునీరు ఇవ్వలేని చంద్రబాబు.. తమపై నిందలు వేయడం సరికాదని పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. శుక్రవారం తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు చంద్రబాబు విశాఖ వచ్చారని, ఆ పని చూడకుండా.. విశాఖ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడారని విమర్శించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం చూస్తుంటే..చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే.. టిడిపి నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసలు ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/