ప్రకాశం బ్యారేజీ నుండి నీటి విడుదల

Prakasam Barrage
Prakasam Barrage

విజయవాడ: జగన్‌ ప్రభుత్వం ఈరోజు ప్రకాశం బ్యారేజి నుండి తూర్పు డెల్డా కాలువకు నీటిని విడుదల చేసింది.ముహూర్తం ప్రకారం ఉదయం 9.47 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ అధికారులు అనిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. చివరి భూముల వరకు నీటిని అందించేలా‌ చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. పది రోజుల తర్వాత గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని విడుదల‌ చేస్తామన్నారు.


తాజా ఏపి ఆసెంబ్లీ బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/ap-assembly-session-2019