వివేకా హత్యకేసు నిందితులకు రిమాండ్‌ పోడిగింపు

YS Vivekananda
YS Vivekananda

పులివెందుల: వైఎస్‌ఆర్‌సిపి నేత, మాజీ ఎంపి వైఎస్‌ వివేకానందరెడ్డి హ్యతకేసు నిందితులకు జూన్‌ 17 వరకు రిమాండ్‌ పొడిగించారు. వివేకాను ఆసుపత్రికి తరలించే సమయంలో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగాల మీద అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిని పలు దఫాలుగా కోర్టులో హాజరుపర్చగా జూన్ 3వరకు రిమాండ్ విధించారు. ఆ రిమాండ్ ముగియడంతో, మరోసారి న్యాయస్థానం ముందుకు తీసుకురాగా, ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అనంతరం వీరిని పులివెందుల సబ్ జైలుకు తరలించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/