వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య

YS Vivekananda
YS Vivekananda

కడప : మాజీ మంత్రి, వైసిపి నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. వివేకా హత్య కేసులో తనను అనుమానిస్తూ విచారణ పేరిట పోలీసులు వేధిస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు పలుమార్లు విచారించారు. దీంతో ఆవేదనకు గురైన శ్రీనివాసులు రెడ్డి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబీకులు తెలిపారు. 30 ఏళ్లుగా వివేకా కుటుంబానికి సేవ చేస్తున్నామని, వివేకా హత్యతో తనకు గానీ, తన బావ శ్రీనివాసులు రెడ్డికి గాను ఎటువంటి సంబంధం లేదని మరో అనుమానితుడు పరమేశ్వర్‌ రెడ్డి తేల్చి చెప్పారు. శ్రీనివాసులు రెడ్డి నిద్రమాత్రలు మింగిన విషయాన్ని గమనించి తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/