జనసేనకు విశ్వం ప్రభాకరరెడ్డి రాజీనామా

viswam prabhakarreddy
viswam prabhakarreddy

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వం ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నియోజకవర్గ కష్టాలు తెలియజేసేందుకే పవన్‌కళ్యాణ్‌ను పర్యటనకు ఆహ్వానించానన్నారు. పలు కారణాల రీత్యా ఆయన నియోజకవర్గంలో పర్యటించలేదన్నారు. ప్రజల సమస్యలే తెలుసుకోలేనపుడు ప్రజలకు న్యాయం చేయలేమని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై ఆయన సొంత పార్టీ విశ్వం యువసేన ద్వారా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని నియోజక అభివృద్దే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

తాజా వార్త‌ల‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/