మేమే డ్రోన్ ను ప్రయోగించాం: ఏపీ జలవనరుల శాఖ

chandrababu house
chandrababu house

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఈరోజు ఓ డ్రోన్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తన భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారనీ, హై సెక్యూరిటీ జోన్ లో అసలు డ్రోన్ ను ఎలా ప్రయోగిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుకఉన్న వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో డ్రోన్ ద్వారా విజువల్స్ తీయాల్సిందిగా తామే ఆదేశించామని ఏపీ జలవనరుల శాఖ తెలిపింది.

వరద పరిస్థితిపై అంచనాకు వచ్చేందుకు విజువల్స్ తీయాల్సిందిగా కోరామని వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతం నుంచి మరింత వరద వచ్చే అవకాశముందని చెప్పింది. ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ఓ అవగాహనకు వచ్చేందుకే విజువల్స్ తీయాలని నిర్ణయించామని పేర్కొంది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/