శ్రద్దా హాస్పటల్‌ ఎండీ అరెస్ట్‌

visakhapatnam-sraddha-hospital
visakhapatnam-sraddha-hospital

విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని శ్రద్దా హాస్పటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ను పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. అయితే గత కొద్ది రోజులుగా శ్రద్దా హాస్పటల్‌ అక్రమ పద్దతుల్లో కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఆసుప‌త్రిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శ్ర‌ద్ధా హాస్ప‌ట‌ల్ 68 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ స‌ర్జరీలు చేసింద‌ని, అందులో 29 స‌ర్జ‌రీల‌కు ఎటువంటి అనుమ‌తి లేద‌ని క‌మిటీ పేర్కొన్న‌ది.జిల్లా క‌లెక్ట‌ర్ కే భాస్క‌ర్ ఆదేశాల ప్ర‌కారం.. హాస్ప‌ట‌ల్‌ను శ‌నివారం మూసివేశారు. ముగ్గురు స‌భ్యుల క‌మిటీ ఇచ్చిన ఆదేశాల‌ను పోలీసులు పాటించారు. అంతేకాక కిడ్నీ రాకెట్‌లో మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్న‌ డాక్ట‌ర్ మంజూనాథ్‌ను కూడా బెంగుళూరులో అరెస్టు చేశారు.


తాజా సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/