పలు కుటుంబాలలో పెను విషాదం

5వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ లీక్

Vizag leakage incident-

Visakhapatnam: విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన పలు కుటుంబాలలో పెను విషాదాన్ని నింపింది. ఆదమరచి నిదురపోతున్నవారిని అదిరిపడి లేచి పరుగులెత్తేలా చేసింది.

ఏం జరుగుతోందో తెలిసేలోగా తీవ్ర అస్వస్థతలోకీ, అపస్మారక స్థితిలోకీ నెట్టేసింది. రోడ్లపై పరుగులు తీస్తున్న వారు తీస్తున్నట్లే కుప్పకూలిపోయారు.

చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. పశువులు విలవిలలాడాయి. గ్యాస్ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి.

లీకైన గ్యాస్ దాదాపు 5వేల మెట్రిక్ టన్నులని సమాచారం.

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన గ్యాస్ స్టీరిన్ అని అధికారులు తెలిపారు. లీకైన  గ్యాస్  దాదాపు  5వేల మెట్రిక్ టన్నులని సమాచారం.   

ఈ స్థాయిలో గ్యాస్ లీక్ కావడం అంటే ప్రమాదం తీవ్ర స్థాయిలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  తెల్లవారు జామున గ్యాస్ లీక్ కావడంతో దానిని పీల్చిన వేలాది మంది స్పృహ కోల్పోయారు. 

 బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తోంది.    ప్రధాని మోడీ   జగన్ కు ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. 

దీనిపై మోడీ జాతీయ విపత్తు నిర్వాహణ శాఖాధికారులతో మోడీ సమావేశం అయ్యారు.  బాధితులకు అన్ని రకాల చర్యలు  అందించాలని ఆదేశించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/