రోజాకు రాములమ్మ మద్దతు

roja , vijayashanti
roja , vijayashanti

హైదరాబాద్‌: నగరి ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు రోజా విషయమై విజయశాంతి తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రోజాకు కూడా జగన్‌ కేబినెట్‌లో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని, సినీ రంగం నుంచి వచ్చిన వారిని కేవలం ప్రచారానికి పరిమితం చేయకుండా వారి సేవలను వినియోగించుకోవాలని వారికి తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో ఏపి సియం జగన్‌ రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని విజయశాంతి ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/