పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి

Vijaysai Reddy
Vijaysai Reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అంతేకాక లోక్‌సభలో వైఎస్‌ఆర్‌సిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌ను నియమించారు. ఈముగ్గురిని ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు ఏపి సిఎం జగన్‌ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాశారు. వైఎస్‌ఆర్‌సిపిలో కీలకనేతగా ఉన్న విజయసాయిరెడ్డినిపార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/