చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం సీఎం జగన్ చేసిన ఎంతో మంచిపనని, చంద్రబాబు దాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనలో ఉన్నారని వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను గవర్నమెంటులోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ప్రాణం పోశారు జగన్ గారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి చంద్రబాబునాయుడు గారూ. నవ్వుతారుఖి అని వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/