కోడెలపై విజయసాయిరెడ్డి ఆగ్రహం

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: ఏపి అసెంబ్లీ ఫర్నీచర్ తన దగ్గరే ఉందని టిడిపి నేత, మాజీ స్పీకర్ కోడెల ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా కోడెల వ్యవహారశైలిపై వైఎస్‌ఆర్‌సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి కోడెల శివప్రసాద్ ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ను ఎత్తుకెళ్లారని విజయసాయిరెడ్డి విమర్శించారు. అలాంటి వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల దొంగతనానికి పాల్పడటం ద్వారా 5 కోట్ల మంది పరువు తీశాడని దుయ్యబట్టారు. కోడెల, ఆయన దూడలను టిడిపి నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఇప్పటికైనా చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/