చంద్రబాబుకి విజయసాయిరెడ్డి సూచన

దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే ఆయన చేతులెత్తేశారంటూ ట్వీట్ చేశారు. ‘రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/