ఆయనకు ప్రజల్లోకి వెళ్లేందుకు మోహం చెల్లట్లేదు

ఓటమి భయంతో ఎన్నికలు నిర్వహించకుండా వేలాది కోట్ల నిధులు పోగొట్టారు

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి పోయాడు. ఓటమి భయంతో రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా వేలాది కోట్ల నిధులు పోగొట్టాడు. ఇప్పుడు మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు జరగకుండా కుట్ర పన్నాడు. ప్రజల్లోకి వెళ్లేందుకు మోహం చెల్లక చంద్రబాబు ఇలాంటి నికృష్టపు పనులకు దిగాడు’ అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడడం చంద్రబాబు నాయుడి కుట్రేనని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/