పవన్‌ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు

Vijay Sai Reddy
Vijay Sai Reddy

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టిడిపి చేతిలో ఓ కీలుబొమ్మలా మారిపోయారని వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. టిడిపి ప్రభుత్వం తప్పుదారి పట్టించినందునే ఇప్పుడు పవన్ కల్యాణ్ నిశ్శబ్ధంగా ఉన్నారు. టిడిపి గ్లేమ్ ప్లాన్ లో భాగంగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మలా పవన్ వ్యవహరిస్తున్నారు అని అన్నారు. ఆపై ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వసూలయ్యే పన్నును ఆదా చేసేలా సాగుతున్నాయి. పారదర్శకతపై దేశానికే ఆదర్శంగా నిలిచి, ఓ దిశను చూపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో చౌకబారు ప్రచారం కోసం కాకుండా పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు ఏదైనా విమర్శలు చేసేటప్పుడు ముందూ, వెనుకా ఆలోచించాలి అని కూడా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/