విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించారు

వీధికో బెల్ట్ షాపు పెట్టించారు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించాడు’ వైఎస్ లాగే జగన్ గారి హయాంలో ఆ ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ‘వీధికో బెల్ట్ షాపు పెట్టించడం.. నదుల్లోని ఇసుక దోచుకోవడం.. గిరిజన ప్రాంతాల్లో ఖనిజాలను కొల్లగొట్టడం, పచ్చని కొండల్లో అగ్గి రాజేయడం తప్ప చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో విజయనగరానికి చేసిందేమీ లేదు. గత 30 ఏళ్ల చరిత్ర చూస్తే జిల్లాకు ఏదైనా మేలు జరిగిందంటే అది వైఎస్ హయాంలోనే. సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్ల మంజూరు చేశారు. అందుకే జిల్లా ప్రజలు ఆ మహానేతను గుండెల్లో పెట్టుకున్నారు. చంద్రబాబు తన పాలనలో జిల్లాపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంటే , చివరకు గజపతుల కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నా కళ్లున్నా చూడలేని, చెవులున్నా వినలేని స్థితికి వెళ్లిపోయారు అశోక్ రాజావారు’ అని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/