తిరుపతిలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి

vice president Venkaiah Naidu
vice president Venkaiah Naidu

తిరుపతి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుపతిలో పర్యటిస్తున్నారు. గాధంకి జాతీయ వాతావరణ పరిశోధన సంస్థను వెంకయ్యనాయుడు సందర్శించారు. డేటా కేంద్రం, ఎంఎస్‌టీ రాడార్, హెచ్‌ఎఫ్ రాడార్‌లను పరిశీలించారు. తరువాత శాస్త్రవేత్తలతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. ఎన్‌ఏఆర్‌ఎల్‌లో వెంకయ్యనాయుడు మొక్కలు నాటారు. మధ్యాహ్నం పద్మావతి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు తిరుమల కొండపైకి వెళతారు. రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఎల్లుండి హైదరాబాద్ చేరుకుంటారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/