శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

Venkaiah Naidu with his wife
Venkaiah Naidu with his wife

తిరుమల: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శింకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ నైవేధ్య విరామ సమయంలో కటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వైకుంఠం1 క్యూ కాంప్లేక్స్ ద్వారా వెంకయ్య నాయుడు ఆలయ ప్రవేశం చేసారు. ఆలయ మహా ద్వారం వద్ద వారికి ఆలయ అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల‌ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఆకలి అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలని, యాధ్బావం తద్భవతి. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆయన తెలిపారు. ప్రపంచ మానవాళి సుఖఃసంతోషాలతో జీవించాలని, ఘర్షణలు, అత్యాచారాలు,అవినీతి, అసమానతలు లేని మార్గాన్ని చూపించాల్సిందిగా స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/