జగన్, కేసీఆర్ కలిసి చర్చించుకోవడం అభినందనీయo

VENKAIAH NAIDU
VENKAIAH NAIDU

Visakhapatnam: తెలుగు రాష్ట్రాల సీఎంలు సోదరభావంతో చర్చించుకోవడం వాంఛనీయ పరిణామమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజిక్కడ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ  చర్చల ద్వారా వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నించడం అభినందించాల్సిన విషయమన్నారు.  కేంద్రం జోక్యం అవసరం లేకుండా పరిష్కారం చేసుకోగలిగితే ఇంకా మంచిదన్నారు. గడిచిన ఐదేళ్లలో తాను ఇదే ఆకాంక్షను వ్యక్తం చేశానని గుర్తు చేశారు.  కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదన్నారు. గవర్నర్ సమక్షంలో జగన్, కేసీఆర్ కలిసి చర్చించుకోవడం అభినందనీయమన్నారు.  ఇంకా కొలిక్కిరాని అంశాలను సత్వరం పరిష్కరించుకోవాలన్నారు. పాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్నారు.