బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం సరికాదు

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి

vellampalli srinivas
vellampalli srinivas

అమరావతి: వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం సరికాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శాసనమండలిలో టిడిపి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మంత్రి మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు పార్టీలకతీతంగా వ్యవహరించాలని అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. బిల్లులను అడ్డుకుని చంద్రబాబు నాయుడు ఎం సాధించారు? అని ప్రశ్నించారు. గ్యాలరీలో కూర్చుని చంద్రబాబు మండలి చైర్మన్‌ను ప్రభావితం చేశారని విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లో చైర్మన్‌ వ్యవహరించారని అన్నారు. తాను చేసేది తప్పు అని మండలి చైర్మన్‌ ఒప్పుకున్నారని వెల్లంపల్లి చెప్పారు. చట్టసభలపై గౌరవం లేకండా టిడిపి వ్యవహరించిందని మంత్రి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి 13 జిల్లాలో అభివృద్ధి జరగాలని ఆశించారని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/