స్పీకర్‌ పదవిని దిగజార్చిన చరిత్ర మీదే

vellampalli srinivas
vellampalli srinivas

విజయనగరం: నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు కాగా దీనిపై స్పందించిన ఎపీ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నారాలోకేష్‌ కార్పెరేటర్‌ ఎక్కువ, ఎమ్మెల్సీ తక్కువగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. లోకేష్‌ స్పీకర్‌కి బహిరంగ లేఖ రాయటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. గతంలో ఎమ్మెల్యెలను సంతలో పశువుల్లా కొన్న ఘనత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందని అన్నారు. అటువంటి చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోలేని స్థితిలో స్పీకర్‌ ఉండేవారని గుర్తుచేశారు. స్పీకర్‌ పదవిని దిగజార్చిన చరిత్ర ఉన్న మీరు బహిరంగ లేఖ రాయటం దేయ్యాలే వేదాలు వల్లించినట్లుగా నారాలోకేష్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/