వెలగపూడి గ్రామస్థుల అసెంబ్లీ ముట్టడి

AP assembly
AP assembly

అమరావతి: రాజధాని ప్రాంతంలోని వెలగపూడి గ్రామస్థులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఏపి కేబినేట్‌ తీర్మానాన్ని తాము అంగీకరించేదిలేదంటూ, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ వెలగపూడి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కేబినెట్‌ నిర్ణయం వెలువడిన వెంటనే గ్రామంలోని రైతులు, మహిళలు భారీ సంఖ్యలో తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లుగప్పి పొలాల మధ్య నుంచి అసెంబ్లీ ముట్టడి కోసం బయలుదేరారు. దీన్ని గుర్తించిన పోలీసులు మధ్యలోనే వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, మహిళలు మాట్లాడుతూ రాష్ట్రం కోసం తాము తమ భూములు త్యాగం చేస్తే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణమని వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/