టిడిపిలోకి చేరనున్న వంగవీటి రాధ

vangaveeti radha
vangaveeti radha

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యె వంగవీటి రాధ, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ సోమవారం రాత్రి కలిశారు. ఎంపి సుజనాచౌదరి వీరిద్దరిని సిఎం వద్దకు తీసుకెళ్లారు. ఇద్దరు నేతలు కొంత కాలంగా టిడిపిలో చేరవచ్చనే ప్రచారం జరుగుతుంది. అయితే వంగవీటి రాధ పార్టీలో చేరితే ఆయనకు మచిలీపట్నం ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వంగవీటికి టికెట్‌ ఇస్తే మచిలీపట్నం సిట్టింగ్‌‌ ఎంపీ కొనకళ్ల నారాయణను పెడన శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/