ఇద్దరు మవోయిస్టులు హతం

maoists
maoists

విశాఖ: విశాఖ మన్యం పెదబయలు మండలం పెద్దకోడాపల్లి , బురద మామిడి వద్ద మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా.. కానిస్టేబుల్‌ ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. సంఘటనా స్థలిలో రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.సుమారు 20 మంది మావోయిస్టులు కనిపించారని, వారు తమను చూసి కాల్పులు జరపడంతో ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపామని వెల్లడించారు. మరోవైపు స్థానిక గిరిజనులు మాత్రం పోలీసులు ఇద్దరు గ్రామస్థుల్ని కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/