గోదాములో భారీ అగ్నిప్రమాదం

fire accident
fire accident

కడప: కపడ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగింది. లింగాల మండలం దొండ్లవాగు సమీపంలోని దేవిరెడ్డి సంజీవరెడ్డి గోదాములో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గోదాములో నిల్వచేసిన శనగ, ధనియాలు, జొన్నలు దగ్ధమయ్యాయి. కోటి రూపాయలకు పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.విద్యుతాఘాతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
కడప నగరంలోని దేవుని కడపలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో పసుపు ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.20లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/