తిరుమల దేవస్థానంపై కరోనా ఎఫెక్ట్‌

ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు సతమతమవుతున్న టీటీడీ దేవస్థానం

tirumala
tirumala

తిరుమల: కరోనా వైరస్‌ ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై కూడా పడింది. లాక్ డౌన్ తో తిరుమల ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు ఆలయానికి రూ.400 కోట్ల రాబడి తగ్గినట్టు అంచనా వేశారు. దీంతో టీటీడీ తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, ఇతర ఖర్చుల నిమిత్తం ఇప్పటికే రూ.300 కోట్లు ఖర్చు చేశామని, అయితే, బ్యాంకుల్లో శ్రీవారి పేరిట ఉన్న 8 టన్నుల బంగారం, రూ.14 వేల కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల జోలికి వెళ్లకుండా ప్రస్తుత సమస్య నుంచి గట్టెక్కడం ఎలాగన్నదాని గురించి ఆలోచిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నా జీతాలు, పెన్షన్లు, ఇతర తప్పనిసరి ఖర్చులు చెల్లించడం తమ విధి అని అభిప్రాయపడ్డారు. వివిధ విభాగాల కింద టీటీడీ ఖర్చు ప్రతి ఏడాది రూ.2,500 కోట్లు ఉంటుందని వెల్లడించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/