కోయిల్ అళ్వార్ తిరుమంజనం

ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాల జలంతో శుద్ధి

ttd-Koil Alwar Thirumanjanam
ttd-Koil Alwar Thirumanjanam

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 16న ఆణివార ఆస్ధానం పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుక జరిపారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది.

ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది అత్యంత పవిత్ర కార్యక్రమంగా నిర్వహించారు.

టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ విూడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16న తేదీన నిర్వహించబోయే ఆణివార ఆస్ధానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగిందని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/