ఆలయంలో భక్తుల రద్దీ

TTD
TTD

Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 87,623 మంది భక్తులు దర్శించుకోగా, 28,181 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.