తిరుమలలో పరకామణి భవన నిర్మాణానికి భూమి పూజ

రూ. 9 కోట్లతో నూతన భవన నిర్మాణం

Tirumala Temple
Tirumala Temple

తిరుమల: తిరుమలలో నూతన పరకామణి మండప నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమిపూజ నిర్వహించారు. రూ.8.90 కోట్ల వ్యయంతో రెండు అంతస్తుల్లో ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ వ్యయాన్ని బెంగుళూరుకు చెందిన మురళీకృష్ణ అనే భక్తుడు విరాళంగా ఇవ్వనున్నారు. శ్రీవారి ఆలయ సమీపంలోని అన్న ప్రసాద కేంద్రం ఎదురుగా నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం 14962 చదరపు అడుగుల్లో నిర్మాణం ఉండనుంది. భక్తులు విరాళంగా అందించే అన్నీ కానుకలు ఒకే చోట లెక్కించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. కానుకల లెక్కింపు ప్రక్రియను భక్తులు బయట నుండి వీక్షించేలా నూతన భవనంను నిర్మించబోతున్నామని.. ఆలయ ప్రాంగణంలో ఉన్న పరకామణి మండపం చిన్నది కావడంతో ఉద్యోగులు, సేవకులు కనీస వసతులు లేకుండా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన తెలిపారు.

తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/