సుప్రీంకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం

supreme court
supreme court

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపి ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీఆర్డీఏ, పాలనా వికేంద్రీకరణ రద్దు చట్టాలపై ఏపి హైకోర్టు విధించిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ ఏపిప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన స్టేటస్‍ కో ఉత్తర్వులు ఎత్తివేయాలని దాఖలు చేసిన ఆ పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు విచారణ చేస్తున్నందున.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టులో రేపే విచారణ ఉన్నందున మా వద్దకు రావడం సరికాదని స్పష్టంచేసింది. నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించాలని ఏపి ప్రభుత్వం కోరగా.. పలాన గడువులోపు విచారణ ముగించాలని మేం ఆదేశించలేమని తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/