రాజధానిపై సెప్టెంబరు 21వరకు స్టేటస్ కో

అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు

ap high court
ap high court

అమరావతి: ఏపి రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాజాధాని ,సీఆర్డీఏ చట్టం రద్దపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులు ఈరోజుతో ముగిశాయి. దీంతో తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు ధర్మాసనం గడువు ఇచ్చింది. అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు ఇచ్చింది. కాగా, స్టేటస్‌కోను ఎత్తేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించడం, హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోమంటూ ఆ పిటిషన్లను నిన్న అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/