టోల్‌ ప్లాజాల వద్ద సంక్రాంతికి రుసుము రద్దు

Toll Gate HeavyRush
Toll Gate HeavyRush

టోల్‌ ప్లాజాల వద్ద సంక్రాంతికి రుసుము రద్దు

విజయవాడ: రాష్ట్రంలో సంక్రాంతి పండుగను దృష్టిలో వుంచుకుని టోల్‌ప్లాజాలను రద్దు చేస్తూ ఏపి సర్కార్‌ నిర్ణయించింది. సంక్రాంతి పండుగకు రాష్ట్రంంలోని ప్రజలంతా తమ స్వంత ఊర్లకు వెళ్ళడానికి పెద్ద ఎత్తున హైవేలపై ప్రయాణిస్తుండడంతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. శనివారం నుండి 16వ తేదీ వరకు టోల్‌ ట్యాక్స్‌ ఎత్తేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా హైదరాబాద్‌ నుండి తమ స్వస్థలాలకు ప్రజలు బయల్దేరి వెళుతున్నారు. దీంతో టోల్‌గేట్లన్నీ క్రిక్కిరిసిపోతున్నాయి. ఏపిఎస్‌ ఆర్‌టిసి, టిఎస్‌ ఆర్‌టిసిలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను పలు మార్గాల్లో నడుపుతోంది. రిజర్వేషన్‌ ద్వారా సీట్లు లభించని ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.