తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌

Train
Train

రైల్వేకోడూరు:తిరుపతిషిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఈ రోజు ఉదయం పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద ఆ రైలు పట్టాలు తప్పింది. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పట్టాలు తప్పిందని అధికారులు వివరించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రైల్వే సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మరమ్మతులు చేపడుతున్నారు. తిరుపతిషిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/