హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని ప్రణాళిక

తిరుపతి ఏపీ రాజధాని కావడం ఖాయం

chinta-mohan
chinta-mohan

తిరుపతి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి తనకు రహస్య సమాచారం అందిందని చెప్పారు. మరోపక్క, తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కావడం ఖాయమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతిని వదిలి తిరుపతికి రావాలని సూచించారు. రాష్ట్ర రాజధానిగా తిరుపతి అన్ని విధాలా అనువైనదని చెప్పారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/